- రైతుకు గన్నీబ్యాగ్కు రూ.30 చెల్లించడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యాపారులు
వరంగల్: ఎనుమాముల మార్కెట్లో పత్తి, మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి.రైతుకు గన్నీ బ్యాగుకు రూ.30 చొప్పున ధర చెల్లించే విషయంలో తలెత్తి గొడవ కారణంగా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మార్కెట్ లో పత్తి, మిర్చి కొనుగోళ్లను నిలిపివేశామని.. రైతులెవ్వరూ మార్కెట్ కు పత్తి, మిర్చిని తీసుకురావద్దని మార్కెట్ కమిటీ సూచించింది.
గన్నీబ్యాగ్ కు ముప్పై రూపాయలను..రైతుకు చెల్లించడానికి వ్యాపారులు ససేమిరా అంటున్నారు. వ్యతిరేకిస్తూ ఇవాళ కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ కమిటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. చర్చలు కొలిక్కి వచ్చే వరకు కొనుగోలు చేయకుండా నిలిపేశారు.