హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్లను తయారు చేసే ప్యూర్ ఈవీ ఖమ్మంలోని మధిరలో కొత్త షోరూమ్ ఓపెన్ చేసింది. ఇది 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీమ్యాక్స్, ఈప్లూటో 7జీ, ఎకోడ్రైఎఫ్‌టీ 350, ఎంట్రన్స్ నియో ప్లస్, ఈట్రిస్ట్ ఎక్స్ పేరుతో ఎలక్ట్రిక్ టూవీలర్లను మార్కెట్‌లోకి తెచ్చింది.
దేశం మొత్తంమీద రానున్న 30 నెలల్లో 250 షోరూమ్‌లను ఓపెన్ చేయాలని కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. మొత్తం డీలర్‌షిప్‌ల సంఖ్యను 320 కి పెంచుకోవాలని చూస్తోంది.