Double iSmart Official OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్ డబుల్ ఇస్మార్ట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Double iSmart Official OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్ డబుల్ ఇస్మార్ట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రామ్‌ పోతినేని, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’(Double iSmart). ఆగస్ట్ 15 సందర్బంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుండి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డ‌బుల్ ఇస్మార్ట్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు వ‌సూళ్ల‌ను రాబట్టింది. 

ఓటీటీ రిలీజ్:

తాజాగా డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా, చడీ చప్పుడు కాకుండా ఇవాళ గురువారం నుంచి (సెప్టెంబర్ 5)న ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డబుల్ ఇస్మార్ట్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే,ఈ సినిమా రిలీజ్ కు ముందు సెప్టెంబర్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ డిసైడ్ అవ్వగా..నెల రోజుల లోపే అనూహ్యంగా సెప్టెంబర్ 5న రిలీజ్ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

Also Read :- విజయ్ గోట్ మూవీ..టాక్ ఎలా ఉందంటే?

డబుల్ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్‌:

భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీతో పూరి జగన్నాథ్, రామ్ మరో డిజాస్టర్ ను మూటకట్టుకున్నారు. ఈ సినిమాకు ముందు నుంచి ప్రమోషన్స్ తో అంచనాలు పెంచేసిన మేకర్స్ ..కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో భారీగా నష్టాలు తెచ్చుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే, థియేటర్లలో ఫస్ట్ షో నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ..ఓటీటీ ఆడియన్స్ కు ఎలాంటి ఫీస్ట్ ఇస్తుందో చూడాలి.కాగా, డబుల్ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ. 33 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

హిందీ వెర్షన్ ఓటీటీ:

ఇదిలా ఉంటే, డబుల్ ఇస్మార్ట్ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి కేవలం సౌత్ భాషల్లోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే హిందీ వెర్షన్ కూడా ఓటీటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ప్రైమ్ లో కాకుండా నెట్‌ఫ్లిక్స్ లేదా జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. 

వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్:

డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు వెర్షన్ 13.5 కోట్లు, హిందీ వెర్షన్ 1.2 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌తో కలుపుకొని ఈ చిత్రం మొత్తంగా 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 54 కోట్ల రూపాయల షేర్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ చిత్రం దాదాపు 40 కోట్ల రూపాయల నష్టంతో ముగిసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. డబుల్ ఇస్మార్ట్ సినిమాను సుమారుగా రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. అయినా నష్టాలు తప్పలేదు.