పూరిజగన్నాథ్ రథయాత్ర.. తరలివచ్చిన లక్షలాదిమంది భక్తులు 

పూరిజగన్నాథ్ రథయాత్ర.. తరలివచ్చిన లక్షలాదిమంది భక్తులు 

ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరి జగన్నాధ రథయాత్ర ఆదివారం(జూలై 7,2024)  ప్రారంభమైంది. దేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. 1971 నుంచి జరుగుతున్న ఈ రథయాత్రను ఈసారి అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలి వచ్చిన ఈ యాత్ర లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు. మోహన్‌ చరణ్‌ మాఝీ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేసిం ది. 

యాత్ర సమయం, ముగింపు 

జగన్నాథ్ రథ యాత్ర ప్రతి యేటా హిందూ మాసం ఆషాఢలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఆదివారం ఉయం ద్వితీయ తిధి 4.26 గంటలకు ప్రారంభమైన జూలై 8 న ఉదయం 4.59 గంటలకు ముగుస్తుంది. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు.

ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.

జగన్నాథుని విగ్రహం మార్చారు

జగన్నాథుని ఆలయంలో 12 సంవత్సరాల తర్వాత స్వామివారి విగ్రహాలను మార్చారు. ఆ తర్వాత చెక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. దేవుడి విగ్రహాలను మార్చే సమయంలో నగరంలో కరెంటు నిలిచిపోయింది. ఈ కాలంలో కేవలం పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తారు.