బ్యాట్, బాల్ పట్టిన పురోహితులు.. ఫోర్లు, సిక్సర్లతో దద్దరిల్లిన మైదానాలు

నిత్యం వేదపఠనం, పూజలు, యజ్ఞయాగాదులతో బిజీగా ఉండే పురోహితులు మైదానంలోకి దిగారు. బ్యాట్, బాల్ చేతపట్టి క్రికెట్ ఆడారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ అభిమానులను ఉత్సాహ పరిచారు. అదేంటి.. పురోహితులు క్రికెట్ ఆడకూడదా..! అని ప్రశ్నించకండి.. వారు ఆడతుండటం మరింత మందిలో స్ఫూర్తినింపింది అని తెలియచెప్పటానికి చేసిన ప్రయత్నమిది. దాదాపు 19 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో కాకినాడ టీమ్ విజేతగా అవతరించింది. 

ఆంధ్ర ప్రదేశ్‌లోని కోనసీమ వేదికగా పురోహిత క్రికెట్ లీగ్ జరిగింది. మెడలో ఉత్తరీయం, కింద ధోతీ ధరించి వేద మంత్రాలు పఠిస్తూ శాస్తోక్తంగా పూజలు నిర్వహించే పురోహితులు.. ఆ పాత్రధారుల్లోనే మైదానంలోకి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము లేపారు. ప్రొఫెషనల్‌ క్రికెటర్ల మాదిరి కవర్ డ్రైవ్ లు, దిల్ స్కూప్ లు ఆడుతూ చూసేవారిని అలరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వీరి ఆటని కళ్లారా చూడటానికి అభిమానులు పోటెత్తారనే చెప్పాలి. పంచెలు కట్టుకొని పురోహితులు క్రికెట్ ఎలా ఆడతారు.. కాసేపు చూసి నవ్వుకుందాం..! పదండి అంటూ ఊర్లకు ఊర్లే తలివచ్చారు. అంతా బాగా జరిగింది టోర్నీ. 

ALSO READ :- ఎన్నికలు వచ్చాయి కాబట్టే... కేసీఆర్ కొత్త నాటకం : మంత్రి జూపల్లి

ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, తణుకు, భీమవరం, రాజమండ్రితో పాటు తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కొవ్వూరు, కాకినాడ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగ్గా.. 8 పరుగులు తేడాతో కాకినాడ జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన కాకినాడ జట్టు 50వేలు ఎగరేసుకుపోగా.. రన్నరప్ కొవ్వూరు జట్టు రూ.30 వేలతో సరిపెట్టుకుంది. వీటితో పాటు సెమిఫైనల్ కు అర్హత సాధించిన జట్లకు  రూ.10 వేల చొప్పున, బెస్ట్‌ బ్యాటర్, బెస్ట్‌ బౌలర్‌, మ్యాన్‌ఆఫ్‌ ది సిరీస్‌, పెయిర్‌ ఆఫ్‌ ప్లేయర్‌కు నగదు బహుమతులు అందించారు. మొత్తానికి ఈ టోర్నీ సక్సెస్ అవ్వడమే కాకుండా.. చూసినవారికి కడుపుబ్బా నవ్వులు పంచింది.