గుడ్ న్యూస్ : షుగర్ వ్యాధికి సరికొత్త​ నేచురల్ మెడిసిన్

గుడ్ న్యూస్ : షుగర్  వ్యాధికి  సరికొత్త​ నేచురల్ మెడిసిన్
  • తయారు చేస్తున్న తెలంగాణ స్టార్టప్​ ‘పర్పుల్​ లైఫ్​సైన్సెస్​’
  • పర్పుల్​కార్న్, పసుపు,మెంతుల నుంచి తీసిన కాంపొనెంట్స్​తో మందు
  • ఇప్పటికే సొరియాసిస్​ను నయం చేసే ఆయిల్​తయారీ

హైదరాబాద్, వెలుగు: ఒంట్లో బ్లడ్​ షుగర్​ను కంట్రోల్​చేయాలంటే ఇన్సులిన్​ ఇంజెక్షన్​ తీసుకోవాలి.. ట్యాబ్లెట్లు వాడాలి. వాటితో ఒక్కోసారి ఇన్సులిన్​ రెసిస్టెన్స్​కూడా పెరుగుతున్నదన్న వాదనా ఉన్నది. వాటికి చెక్​పెట్టేందుకు నేచురల్​ పరిష్కారాన్ని చూపించింది తెలంగాణకు చెందిన స్టార్టప్ ​సంస్థ పర్పుల్​ లైఫ్​సైన్సెస్. నల్గొండకు చెందిన మణికంఠ రెడ్డి, వికారాబాద్​కు చెందిన రాఘవరెడ్డి కలిసి ఏర్పాటు చేసిన ఈ నేచురల్​ ఔషధ తయారీ స్టార్టప్​కు టీహబ్​సహకారమందిస్తున్నది. పర్పుల్​కార్న్​ నుంచి యాంథో సయనిన్​ను సహజసిద్ధంగా ఎక్స్​ట్రాక్ట్​ చేసి.. వాటికి పసుపు, మెంతుల నుంచి సహజంగా తీసిన పదార్థాలను కలపడం ద్వారా డయాబెటిస్​ను తగ్గించే మందును పర్పుల్​లైఫ్​సైన్సెస్​ సంస్థ తయారు చేస్తున్నది. ప్రస్తుతం ఇది ట్రయల్స్​ దశలో ఉన్నదని మణికంఠ రెడ్డి, రాఘవరెడ్డి చెప్తున్నారు. అన్ని ట్రయల్స్​ పూర్తయ్యాక అతి త్వరలోనే దీనిని మార్కెట్​లోకి తీసుకొస్తామంటున్నారు. తొలుత డయాబెటిస్​ను కంట్రోల్​ చేసే మందులతో కలిపి ఈ మందును ఇస్తారని వారు పేర్కొన్నారు. క్రమంగా ఇన్సులిన్​ రెసిస్టెన్స్​ తగ్గాక.. ఔషధాల అవసరం లేకుండానే ఈ సహజమైన మందును వాడొచ్చని, షుగర్​ను కంట్రోల్​ చేసుకోవచ్చని చెబుతున్నారు. 

ప్రత్యేకంగా పర్పుల్​ కార్న్​ పంట..

మణికంఠ రెడ్డి, రాఘవ రెడ్డి.. డయాబెటిస్​ ఔషధమే కాకుండా ఇప్పటికే సోరియాసిస్​ను తగ్గించే సోకేర్​అనే సహజసిద్ధమైన ఆయిల్​ను తయారుచేశారు. అలాగే, శ్వాసకోశ సంబంధ సమస్యలు సహా ఐదు రకాల మందులను తయారు చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఈ అన్ని ఔషధాల్లోనూ వీరు కామన్​కాంపొనెంట్​గా యాంథో సయనిన్​ను తీసుకుంటున్నారు. దానినీ సహజసిద్ధంగానే తయారు చేస్తున్నారు. అందుకోసం తన స్వస్థలం తిప్పర్తిలో తమకున్న వ్యవసాయ భూమిలోనే పర్పుల్​కార్న్​ను ప్రత్యేకంగా పండిస్తున్నట్టు మణికంఠ రెడ్డి చెప్పారు. దానిని ప్రాసెస్​ చేసి యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేసే యాంథోసయనిన్​ను ఎక్స్​ట్రాక్ట్​ చేస్తున్నామని వివరించారు. సోరియాసిస్​ కోసం తయారు చేసిన సో కేర్​ ఆయిల్​తో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.