![రాజ్ తరుణ్ కొత్త మూవీ పురుషోత్తముడు](https://static.v6velugu.com/uploads/2023/05/Purushottama3_6tE1zu7MGn.jpg)
రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో రమేష్, ప్రకాష్ తెజావత్ నిర్మిస్తున్న చిత్రం ‘పురుషోత్తముడు’. సోమవారం రామానాయుడు స్టూడియోస్ ప్రారంభమైన ఈ చిత్రానికి నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టారు. దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచాన్ చేశారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, రాజారవీంద్ర, సూర్యకిరణ్, చేతన్ చీను, దాసరి కిరణ్ కుమార్, మధు మదాసు తదితరులు అతిధులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, హైదరాబాద్, రాజమండ్రి, కేరళతో పాటు ఓ సాంగ్‌ను ఫారిన్‌లో తీయబోతున్నామన్నారు దర్శక నిర్మాతలు.