అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్..ప్రతి వారం పీఎస్ కు తప్పనిసరి

అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్..ప్రతి వారం పీఎస్ కు తప్పనిసరి

హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌‌కు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌‌ మంజూరు చేస్తూ నాంపల్లి సెకండ్‌‌ మెట్రో పాలిటన్ సెషన్స్‌‌ జడ్జి శుక్రవారం తీర్పు వెల్లడించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌‌ ఉత్తర్వులు సహా అల్లు అర్జున్ తరుఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ.. రూ.50 వేలతో రెండు పూచికత్తులపై బెయిల్ మంజూరు చేసింది. 

అయితే, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. అలాగే, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశిం చింది. కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. ఈ ఘటనలో ఏ1, ఏ2గా ఉన్న సంధ్య థియేటర్ యాజమాన్యం పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌‌లో పెట్టారు.