శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు

శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా..  పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు

పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతోపాటూ ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం నెక్స్ట్ డే మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.  

అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత సినీ ఇండస్ట్రీనుంచి పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భాదిత కుటుంబాన్ని సినీ ప్రముఖులు పరామర్శించకుండా కేవలం అల్లు అర్జున్ ని కలవడానికి వెళుతున్నారని పలువురు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

దీంతో ఈ విషయం సినీ నటుడు జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులోభాగంగా ఓ వీడియోని ఎక్స్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో "అందరికీ నమస్కారం... నేను షూటింగ్ నుంచి రాగానే  శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించాను. అలాగే రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పాను. పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు.. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని" పేర్కొన్నాడు.