టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఈ నెల 04 న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సిననిమాలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫజిల్, సునీల్, అనసూయ, అజయ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఏదో ఒక రికార్డ్ ని బ్రేక్ చేస్తూ, క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.
అయితే సోమవారం పుష్ప 2 మూవీ మేకర్స్ 25 రోజుల కలెక్షన్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా నార్త్ లో ఇప్పటివరకూ రూ.770.25(కోట్లు) కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసింది. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ కూడా షేర్ చేశారు. నార్త్ ఆడియన్స్ ఎక్కువగా పుష్ప 2 కి కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా రూ.1700 కోట్లు(గ్రాస్) కలెక్షన్స్ రాగా ఇందులో 40% శాతానికిపైగా హిందీ వెర్షన్ నుంచి వచ్చాయి.
ALSO READ | అన్‌స్టాపబుల్ షోలో డాకు మహారాజ్ తో సందడి చెయ్యనున్న గేమ్ ఛేంజర్..
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకూ హిందీలో హయ్యేస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో దంగల్, జవాన్, పఠాన్, సలార్, తదితర సినిమాలు టాప్ లో ఉన్నాయి. కానీ 100 ఏళ్ల బాలీవుడ్ సినీ చరిత్ర ని తిరగరాస్తూ పుష్ప 2 అత్యధిక కలెక్షన్లు సాధించి టాప్ లో నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.