Pushpa2: రికార్డుల రప్ప.. రప్ప.. నైజాం రికార్డులను తిరగరాస్తున్న అల్లు అర్జున్

Pushpa2: రికార్డుల రప్ప.. రప్ప.. నైజాం రికార్డులను తిరగరాస్తున్న అల్లు అర్జున్

భారీ అంచనాల మధ్య గురువారం వరల్డ్‌‌‌‌వైడ్‌‌గా విడుదలైంది ‘పుష్ప 2 ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా.. భారతదేశ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ కలెక్షన్స్‌‌తో  కొత్త రికార్డు సృష్టించిందని మేకర్స్ తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇప్పటికీ 2022లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ రూ.233 కోట్లు కాగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఈ రికార్డును మార్చివేసింది. మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌‌తో కొత్త రికార్డు సృష్టించింది.

Also Read:-సాయి దుర్గ తేజ్ పీరియడిక్ యాక్షన్ టీజర్ వచ్చేస్తోంది.. 

గత రికార్డులు అన్నింటినీ తిరగరాస్తూ సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాగా నిలిచింది. నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మొదటి రోజు రూ.23 కోట్లు కలెక్ట్ చేయగా ఈ చిత్రం రూ. 30 కోట్లు కలెక్ట్ చేస్తూ నైజాం రికార్డు కూడా తిరగరాస్తూ ఫస్ట్ ప్లేస్‌‌లో నిలిచింది. రూ.72 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్‌‌తో  హిందీ సినిమా చరిత్రలోనే నూతన రికార్డ్ క్రియేట్ చేసింది. డే వన్ ఆల్ టైం రికార్డ్‌‌తో తెలుగువారి కీర్తిని పెంచిన చిత్రంగా నిలిచింది’ అని చెప్పారు.