Pushpa 2 Day 1 worldwide collections: టాలీవుడ్ లో పుష్ప 2 రికార్డుల ఊచకోత.. ఆ సినిమాల రికార్డులన్ని బ్రేక్..

Pushpa 2 Day 1 worldwide collections: టాలీవుడ్ లో పుష్ప 2 రికార్డుల ఊచకోత.. ఆ సినిమాల రికార్డులన్ని బ్రేక్..

Pushpa 2 Day 1 worldwide collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక మందాన, జగపతిబాబు, రావు రమేష్, అజయ్, కల్పలత, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పుష్ప 2 ఆడియన్స్ అంచనాలని దాదాపుగా అందుకుందని చెప్పవచ్చు. దాదాపుగా 4 ఏళ్లపాటు స్క్రిప్ట్ వర్క్ చేస్తూ సుకుమార్ కష్టానికి ఇండస్ట్రీ దక్కింది. అంతేకాదు తెలుగు సినీ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే పుష్ప 2 వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇందులోభాగంగా మొదటి రోజు పుష్ప 2 ఓవర్సేస్, మనదేశంలో కలిపి దాదాపుగా రూ.294 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే ఇండియన్ సినీ చరిత్రలోనే రిలీజ్ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డులు చేసిందంటూ పోస్టర్ కూడా షేర్ చేశారు. ఇండియా నెం.1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పుష్ప 2 త్వరలోనే మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. 

ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన లిస్ట్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ (రూ.223 కోట్లు), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (రూ.217 కోట్లు), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD (రూ.161.50 కోట్లు), ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్: పార్ట్ 1 (రూ.145 కోట్లు) తదితర చిత్రాలు టాప్ లో ఉన్నాయి. పుష్ప 2 భారీ కలెక్షన్లు సాధించడంతో ఈ రికార్డులు బ్రేక్ చేసి టాప్ లో చేరింది.

ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. దీంతో అన్నిచోట్ల మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఈ క్రమంలో నార్త్ నుంచి కూడా పుష్ప 2కి విశేష స్పందన లభిస్తోంది. దీంతో రిలీజ్ రోజే 72 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జవాన్ (రూ.65 కోట్లు) ఫస్ట్ డే ఓపెనింగ్ రికార్డులని బ్రేక్ చేసింది. దీంతో కలెక్షన్లు ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే పుష్ప 2 సులభంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.