Pushpa 2 second day collection: అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్.. రెండు రోజుల్లోనే రూ.వందల కోట్ల కలెక్షన్స్..

Pushpa 2 second day collection: అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్.. రెండు రోజుల్లోనే రూ.వందల కోట్ల కలెక్షన్స్..

Pushpa 2 second day collection: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 : ది రూల్ డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా భాషాల్లో రిలీజ్ కాగా అన్ని చోట్ల మినిమం ఆక్యుపెన్సీతో ప్రదర్షింపబడుతోంది. అలాగే అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అయితే మొదటి రోజు రూ.294 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే ఈరోజు మేకర్స్ పుష్ప 2 2వ రోజు కలెక్షన్లు ప్రకటించారు. ఇందులోభాగంగా రెండు రోజులకిగానూ ప్రపంచవ్యాప్తంగా రూ.494 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపారు. అలాగే ఈ విషయానికి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఆల్ టైమ్ హిట్ అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పడనగు చేసుకుంటున్నారు. 

అయితే రెండు రోజుల్లనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అయితే టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ లో ఇప్పటివరకూ బాహుబలి 2: ది కంక్లూజన్, ఆర్.ఆర్.ఆర్, కల్కి 2898ad, సలార్, దేవర తదితర సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ రికార్డులపై పుష్ప కన్నేశాడు. ఇక హిందీలో కూడా బన్నీకి మంచి క్రేజ్ ఉండటంతో నార్త్ లో బాగానే వసూళ్ళు సాధిస్తోంది.

Also Read :- ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదు.. ప్లీజ్ నమ్మండి

అయితే పుష్ప 2కి మంచి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ మొదటి రెండు రోజుల్లో టికెట్ రేట్లు కొంతమేర ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్ థియేటర్ లో సినిమాకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. దీంతో నైజాంలో పలు చోట్ల ఆక్యుపెన్సీ తగ్గడంతో టికెట్ రేట్లు తగ్గించినట్లు సమాచారం. ఇక వీకెండ్ మరో రోజు ఉండటంతో ఈరోజు, రేపు ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇదే ఊపు కంటిన్యూ అయితే మరో రెండు రోజుల్లోనే రూ.650 కోట్లు(గ్రాస్) అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.