అలా చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుందనుకుంటా: డైరెక్టర్ సుకుమార్

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ గురువారం గాంధీతాత చెట్టు సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ వచ్చాడు. ఈ సందర్భంగా సినిమాలపట్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇందులోభాగంగా సినిమా తీసేటప్పుడు తన మెయిన్ మోటో ఎంటర్టైన్ మెంట్ అందించడమని అన్నాడు. అలాగే ఒక మనిషిని 3 గంటలు సినిమా తీసి కూర్చోపెడితే ఆ 3 గంటలు క్రైమ్ రేట్ తగ్గుతుందని నమ్ముతానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ ఎంటర్టైన్ మెంట్ తోపాటూ మెసేజ్ అందించే ఛాన్స్ వస్తే రియల్లీ లక్కీ అని ఆ అదృష్టం  గాంధీతాత చెట్టు డైరెక్టర్ పద్మావతి మల్లిడికి దక్కిందని ప్రశంసించారు. ఇక ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందని కాబట్టి ప్రతీ ఒక్కరూ చూసి ఆదరించాలని కోరాడు.  

ఇక సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ మాట్లాడుతూ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన సుకృతి వేణి అద్భుతంగా నటించిందని అన్నారు. అలాగే 13 ఏళ్ళ వయసులో అమ్మాయిలు గుండు చేయించుకోవడానికి ఇష్టపడరని కానీ ఈ సినిమా కోసం సుకృతి గుండు కూడా చేయించుకుని కష్ట పడిందని ఎమోషనల్ అయ్యింది.

ALSO READ | కొడుకు కెరీర్ గురించి స్పందించిన బ్రహ్మానందం.. అందుకే రికమెండ్ చెయ్యలేదంటూ క్లారిటీ..

 డైరెక్టర్ సుకుమార్ ఇటీవలే వచ్చిన పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా 1800 కోట్లు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫిస్ రికార్డులు తిరగ రాసింది. జనవరి 17న 20 నిముషాలు అదనంగా పుష్ప 2 సినిమాకి యద రీలోడెడ్ వెర్షన్ ని మళ్ళీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇటీవలే రీలోడెడ్ వెర్షన్ కి సంబందించిన గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రీలోడెడ్ వెర్షన్ కూడా రూ.150 కోట్లు పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.