తెలుగు స్టార్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలకు గుడ్ బై చెప్పారనే వార్తలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. యుఎస్‌లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలే అందుకు ప్రధాన కారణం. ప్రీరిలీజ్ సంధర్భంగా హోస్ట్ సుమ.. ఒకటి వదిలేయాలంటే ఏది వదిలేస్తారని సుకుమార్‌ను ప్రశ్నించగా.. సినిమాలు చేయడం మానేస్తానని అన్నారు. అతని మాటలు ఆ సమయంలో ఏదో సరదాగా అన్నారని అనిపించినా.. అదే నిజమని టాక్ నడుస్తోంది.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోవడం.. ఆమె కుమారుడు ఆసుపత్రి పాలవ్వడం.. నమ్మి మూడేళ్ల విలువైన సమయాన్ని తనకు కేటాయించిన, ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వంటి ఘటనలు సుకుమార్ మనసుని కలిచి వేసినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. పుష్ప-2 భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. సుకుమార్ సంతోషంగా లేరని అంటున్నారు.
Also Read :నేను ఎలాంటి తప్పు చేయలేదు
నిజానికి సుకుమార్ పుష్ప-2 సక్సెస్ మీట్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయినా నాకు సంతోషంగా లేదని, సినిమాను రీక్రియేట్ చేయగలను కానీ, ఓ జీవితాన్ని తిరిగి ఇవ్వలేమని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఈ మాటలను బట్టి చేతిలో ఉన్న సినిమాలు మినహా కొత్తవేవి చేయకూడదని సుకుమార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైవిధ్యమైన కథలతో, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించే సుకుమార్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో విలువైన ఆస్తిగా చెప్పవచ్చు. అటువంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకు దూరమవుతున్నారంటే అది లోటుగానే చెప్పుకోవాలి.
రూ. 2 కోట్ల ఆర్థిక సాయం
మరోవైపు, తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్ రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్ రూ. 1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు ఇచ్చారు.