గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పుష్ప డైరెక్టర్..

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పుష్ప డైరెక్టర్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విలక్షణ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీయారా అద్వానీ నటిస్తుండగా ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించగా, సినీ నిర్మాత దిల్ రాజు దాదాపుగా రూ.300 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. 

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చిత్ర యూనిట్ కూడా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా అమెరికాలో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ ఈవెంట్ కి వచ్చే గెస్ట్స్ పై ఆసక్తి నెలకొంది. 

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అథితిగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ రానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో సుకుమార్ ఫ్యాన్స్ అనందం వ్యక్తం  చేస్తున్నారు. అయితే సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన 7 రోజుల్లోనే రూ.1067 కోట్లు కలెక్ట్ చేసింది.

ALSO READ | Allu Arjun: మొన్న సీఎం పేరు... ఇప్పుడు సుకుమార్ పేరు మర్చిపోయాడంటూ అల్లు అర్జున్ పై ట్రోలింగ్..

ఈ విషయం ఇలా ఉండగా గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. దీంతో గేమ్  ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్ TX 75040 లొకేషన్ లో సాయంత్రం 6:00 గంటలకి ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.