Baby John Day 2 Collections: రిస్క్ చేసిన బాలీవుడ్ హీరో.. పుష్ప 2 దెబ్బకి 50% డ్రాప్ అయిన కలెక్షన్స్..

Baby John Day 2 Collections: రిస్క్ చేసిన బాలీవుడ్ హీరో..  పుష్ప 2  దెబ్బకి 50% డ్రాప్ అయిన కలెక్షన్స్..

Baby John Day 2 Collections: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, తమిళ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం బేబీ జాన్. ఈ సినిమాని తమిళ్ లో సూపర్ హిట్ అయిన తేరి సినిమా రీమేక్. ప్రముఖ తమిళ్ డైరెక్టర్ కలిస్ దర్శకత్వం వహించగా మరో స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ నిర్మించాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. 

అయితే రిలీజ్ రోజు రూ.11.75 కోట్లు కలెక్షన్స్ రాబట్టి డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. కానీ రెండో రోజు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో రెండో రోజు రూ.4.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకూ బేబీ జాన్ రూ.15.85 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 05 రిలీజ్ అయిన పుష్ప 2: ది రూల్ సినిమా ఎఫెక్ట్ బేబీ జాన్ జాన్ పై పడినట్లు తెలుస్తోంది. కాగా గురువారం .9.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో అనవసరంగా ఇయర్ ఎండ్ లో వరుణ్ ధావన్ తన సినిమాని రిలీజ్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Also Read : నా కంటే పెద్ద స్టార్ అల్లు అర్జున్

ఈ విషయం ఇలా ఉండగా బేబీ జాన్ కోసం చిత్ర యూనిట్ దాదాపుగా రూ.150 కోట్లు బడ్జెట్ వెచ్చించారు. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్ దాదాపుగా 50% శాతం ఉంది. మేకింగ్, ప్రమోషన్స్, ఇతర ఖర్చులు దాదాపుగా రూ.100 కోట్లు పైగా ఉన్నాయి. దీంతో బేబీ జాన్ బ్రేక్ ఈవెన్ తాగేట్ రూ.100 కోట్లు పైగా ఉంది. మరి ఈ వారాంతంలోనైనా కలెక్షన్స్ రాబడుతుందో లేదో చూడాలి.