డ్రగ్స్ బారినపడిన వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండంటూ అల్లు అర్జున్ వీడియో...

డ్రగ్స్ బారినపడిన వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండంటూ అల్లు అర్జున్ వీడియో...

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 : ది రూల్ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో పడ్డారు. ఐతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాంటీ డ్రగ్స్, నార్కోటిక్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ వీడియోస్ చెయ్యాలని నిబంధన తెచ్చింది. 

దీంతో అల్లు అర్జున్ ఈరోజు ఈవిషయంపై వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో పుష్ప2 లో నటించిన కొందరు జూనియర్ ఆర్టిస్టులతోపాటూ హీరో తల్లిపాత్రలో నటించిన కల్పలత కూడా నటించింది. ఇందులో డ్రగ్స్ కి బానిసైన యువకుడి పాత్రలో కనిపించింది. చివరగా అల్లు అర్జున్ మీకు తెలిసినవారిలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ బానిసలయ్యుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కి సమాచారం అందించాలని తెలిపాడు. 

అలాగే 1908 కి ఫోన్ చేసి డీటెయిల్స్ చెబితే వాళ్ళే వచ్చి డ్రగ్స్ కి బానిసలైనవారిని రిహార్బ్ సెంటర్ కి తీసుకెళ్ళి మళ్ళీ మాములు మనుషులను చేస్తారని వెల్లడించాడు. అలాగే డ్రగ్స్ వినియోగించే వారిని శిక్షించడం గవర్నమెంట్ ఉద్దేశం కాదని కేవలం వారికి సహాయం అందించడమేనని తెలిపాడు. మెరుగైన సమాజం కోసం మీవంతు సహాయం చెయ్యడంటూ కోరాడు. దీంతో అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అలాగే ఈ వీడియోని వైరల్ చేస్తూ సొసైటీకి మంచి చేయడంలో మేము కూడా భాగం అవుతామని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో తెలుగు ప్రముఖ హీరో ఎన్టీఆర్ కూడా డ్రగ్స్ వినియోగంపై అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వీడియో చేశాడు. ఈ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే డ్రగ్స్ ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.