Pushpa2 7days collections:టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. అయితే ఇన్ సినిమా తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.400 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 టీమ్ నార్త్ ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పడానికి డిల్లీలో థాంక్స్ మీట్ నిర్వహించారు.
పుష్ప 2 సినిమా హిందీ రైట్స్ కొన్న ప్రముఖ సినీ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని మాట్లాడుతూ ఆడియన్స్ కి థాంక్స్ తెలిపాడు. అలాగే ఈ సినిమాని ఇంతపెద్ద హిట్ చేసిన ప్రతీఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్రమంలో యాంకర్ మాట్లాడుతూ ఇప్పటికే పుష్ప 2: ది రూల్ వరల్డ్ వైడ్ 1000 కోట్లు కలెక్ట్ చేసిందని ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అడిగాడు.
దీంతో అనిల్ తడాని మాట్లాడుతూ త్వరలోనే రూ.2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐతే హిందీ పుష్ప 2 రైట్స్ కోసం అనిల్ తడాని దాదాపుగా రూ.220 కోట్లు పైగా వెచ్చించి కొన్నాడు. కానీ హిందీలో మాత్రమే పుష్ప 2 దాదాపుగా రూ.400 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. వీకెండ్ దగ్గరపడుతుందనటంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కేవలం హిందీలో దాదాపుగా రూ.800 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తన్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా అత్యంత ఫాస్ట్ గా రూ.1000 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప2 రికార్డులు క్రియేట్ చేసింది. కాగా ఈ ఫీట్ ని పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే అందుకుంది. అంతేకాదు రిలీజ్ అయిన మొదటివారంలోనే రూ.1067 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేరిన తోలి టాలీవుడ్ సినిమాగా రికార్దులెక్కింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అయితే ఇప్పటివరకూ టాలీవుడ్ లో మొదటివారంలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల లిస్టుని చూసినట్లయితే బాహుబలి 2: ది కంక్లూజన్ (రూ.800 కోట్లు), ఆర్.ఆర్.ఆర్ (రూ.700 కోట్లు), కల్కి 2898AD (రూ.395 కోట్లు), సలార్ (రూ. 320 కోట్లు) తదితర చిత్రాలు ఉంన్నాయి. ఇప్పుడు ఈ రికార్డులన్నీ పుష్ప 2 బ్రేక్ చేసింది.
#Pushpa2TheRule grosses 1067 CRORES in its first week marking THE HIGHEST FIRST WEEK GROSS EVER IN INDIAN CINEMA 💥💥
— Pushpa (@PushpaMovie) December 12, 2024
The Wildfire Blockbuster is a rage all over 🔥🔥#PUSHPA2HitsFastest1000Cr
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon… pic.twitter.com/OuT3vaDvdc