Pushpa 2: the rule day 28 collection: 28 రోజుల్లోనే బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన పుష్ప రాజ్...

Pushpa 2: the rule day 28 collection: 28 రోజుల్లోనే బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన పుష్ప రాజ్...

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 : ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా రిలీజ్ అయి నేటితో 28 రోజులు. అయితే పుష్ప 2 రిలీజ్ అయిన రోజు నుంచి ఎదో ఒక విభాగంలో రికార్డులు క్రియేట్ చేస్తూ, బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ తో పుష్ప 2 నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా అన్ని భాషల్లో ఆడియన్స్ ని ఆలరిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే సౌత్ కంటే నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

గురువారం పుష్ప 2 టీమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రకటించారు. ఇందులోభాగంగా 28 రోజుల్లో  రూ.1799 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. అలాగే  రియాక్ర్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అంటూ పోస్టర్ కూడా షేర్ చేశారు. 

ఇప్పటివరకూ టాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన లిస్ట్ లో తెలుగు ప్రముఖ స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2: ది కంక్లూజన్ వరల్డ్ వైడ్ ఆల్ టైమ్ రూ.1788. కోట్లు (గ్రాస్) సాధించి టాప్ లో ఉంది. కానీ బన్నీ పుష్ప 2 కేవలం 28 రోజుల్లో ఈ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటివరకూ ఈ రికార్డ్ ని బ్రేక్ చెయ్యడానికి 8 ఏళ్ళు పట్టింది. దీంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.