అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన రష్మిక.. అందరూ కలసి అలా చేశారంటూ ఎమోషనల్ ట్వీట్..

అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన రష్మిక.. అందరూ కలసి అలా చేశారంటూ ఎమోషనల్ ట్వీట్..

తెలుగు ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసి చాలా బాధ కలిగిందని అన్నారు. అలాగే ప్రస్తుతం నేను చూస్తున్నది నమ్మలేకపోతున్నానని, అందరూ కలసి కేవలం ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరం అని తన ఎక్స్ లో ట్వీట్ చేసింది.

 అయితే రష్మిక, అల్లు అర్జున్ కలసి జంటగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా భషాల్లో దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ కాగా వరం రోజుల్లోనే రూ.1060 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది.

ALSO READ : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన తెలుగు హీరోయిన్.. అలాంటి వాడంటూ కామెంట్స్..

ఇక అల్లు అర్జున్ అరెస్ట్ విషయానికొస్తే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధిచి విచారించాలని నాంపల్లి కోర్టు పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించగా అల్లు అర్జున్ కి సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో కండీషన్స్ తో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణ పూర్తయ్యేంతవరకూ దేశంవిడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది. దీంతో ఈ విషయం టాలీవడ్ లో హాట్ టాపిక్ గా మారింది.