Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ

Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ

పుష్ప 2 ది రూల్ (Pushpa2TheRule)  గ్లోబల్ రేంజ్‍లో దూసుకెళ్తోంది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ మూవీ హయ్యెస్ట్ వ్యూస్తో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఊహించినట్లుగానే ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకు ఒక ఉదాహరణగా ఓ వీడియో చెప్పకనే చెప్పింది.

ఒక ఇంటర్నేషనల్ పేజీ పుష్ప 2  క్లైమాక్స్ పోరాట సన్నివేశాన్ని X లో షేర్ చేసింది. ఈ వీడియోకి ఏకంగా 4.4 మిలియన్లకు (44 లక్షలకి) పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య నిమిషం నిమిషం మరింత పెరుగుతూనే ఉంది. క్లైమాక్స్ పోరాటంలో అల్లు అర్జున్ నటన యొక్క తీవ్రత.. అంతర్జాతీయ ఆడియన్స్ను కూడా ఆశ్చర్యపరిచింది. థియేటర్స్లో సినిమా చూసిన ప్రేక్షకులు సైతం.. మళ్లోసారి నెట్‌ఫ్లిక్స్‌లో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

లేటెస్ట్గా వైరల్ పోస్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా Xలో పోస్ట్ చేస్తూ.. "రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్" అనే క్యాప్షన్ ఇచ్చింది. రోజురోజుకి సినిమాపై ఆదరణ పెరుగుతుండటంతో.. దాని ప్రేక్షకాదరణ సంఖ్య తారా స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 నిర్మాతలు ఇంగ్లీష్ వెర్షన్‌ను రిలీజ్ చేయడాన్ని పరిశీలిస్తారా? లేదా అనేది ఆసక్తిగా మారింది. అలా జరిగితే, పుష్ప రాజ్ యొక్క నిజమైన విధ్వంసం షురూ కావడం పక్కా! 

Also Read : షారూఖ్, సల్మాన్ కుంభమేళాకు వెళ్లారా

నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో భారీ వ్యూస్‍తో ఆరో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. త్వరలో ఈ మూవీ ఇండియా ట్రెండింగ్‍ మూవీస్ టాప్-1 జాబితాలో సత్తాచాటడానికి దగ్గర్లో ఉంది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి రూ.1900 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.1233.62 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి.