Sandhya Theatre: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన పుష్ప 2 నిర్మాతలు..

Sandhya Theatre: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన పుష్ప 2 నిర్మాతలు..

పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్‎లో తొక్కిసలాటలో  రేవతి (36) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు.

ఈరోజు పుష్ప 2 సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సంఘటనపై సోషల్ మీడియా వెదికగా స్పందించారు. ఇందులోభాగంగా పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. అస్వస్థతకి గురైన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. అలాగే బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాము. ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబానికి అండగా నిలవడంతోపాటూ సాధ్యమైనంత సహాయం చెయ్యడానికి కృషి చేస్తామని ఎక్స్ ద్వారా తెలిపారు.

ALSO READ : Pushpa 2 : అల్లు అర్జున్ టీంపై క్రిమినల్ కేసు నమోదు

అయితే బుధవారం రాత్రి తెలంగాణలో 9:30 గంటల షోస్ కి పర్మిషన్ ఉండడంతో భాస్కర్ అనే వ్యక్తి తన భార్య రేవతి, కొడుకు శ్రీ తేజతో కలసి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి వచ్చాడు. ఇదే థియేటర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావడంతో ఒకసారిగా అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరగడంతో రేవతి అక్కడిక్కడే మృతి చెందింది. అలాగే బాలుడి శ్రీ తేజ కూడా తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. దీంతో బాలుడిని దగ్గరిలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతన్నాడు.