Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (Pushpa 2)మూవీ జనవరి 30న ఓటీటీలోకి రానుందని సమాచారం. డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ జనవరి 29తో 56 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ అవుతుంది. దీంతో ఈ నెలాఖరున డిజిటల్‌గా ప్రీమియర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే, మైత్రి మేకర్స్ పుష్ప 2 (డిసెంబర్ 20న) ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను X లో వెల్లడించారు. పుష్ప 2: ది రూల్ ఓటీటీ విడుదల 56 రోజుల తర్వాతే అని తెలిపారు. దీంతో జనవరి 30న ఓటీటీలోకి రానుందని సంకేతాలు బయటికి వచ్చాయి.

పుష్ప 2 ఓటీటీ:

పుష్ప 2 హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా రూ.250 కోట్లకు స్ట్రీమింగ్ హక్కుల్ని కైవసం చేసుకుందని టాక్. ఈ మూవీ జనవరి 30, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం మరియు తమిళంలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ పై మైత్రి మేకర్స్ నుంచి,  ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

పుష్ప 2 కలెక్షన్స్:

దాదాపు రూ.400-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2 మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండియాలో ఈ మూవీ రూ.1228.9 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. జనవరి 6 వరకు పుష్ప 2.. వరల్డ్ వైడ్ గా రూ.1832 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మైత్రి మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక అప్పటినుంచి ఎలాంటి వసూళ్ల అప్డేట్ పోస్టర్ విడుదల చేయలేదు.