సంధ్య థియేటర్ ఘటన: బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కు ఇచ్చిన పుష్ప2 నిర్మాత

సంధ్య థియేటర్ ఘటన: బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కు ఇచ్చిన పుష్ప2 నిర్మాత

 సంధ్య థియేటర్  ఘటన బాధిత కుటుంబానికి పుష్ప నిర్మాత నవీన్ యేర్నేని రూ. 50 లక్షల చెక్కును అందజేశారు.   కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను మంత్రి కోమటి రెడ్డితో కలిసి నిర్మాత నవీన్ యేర్నేని పరామర్శించారు. 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ కు  అందజేశారు.  

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటి రెడ్డి.. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని సూచించారు.  సినిమా హోరోల ఇండ్లపై దాడులు చేయకూడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని అన్ని పుకార్లు ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు..ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతా చేయొద్దన్నారు. 

Also Read :- అల్లు అర్జున్ ప్రభుత్వాన్నిబద్నాం చేయాలనుకుండు

 సికింద్రాబాద్ సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న  రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల  తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే..ఈ ఘటనలో సినిమాకు వచ్చిన  రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. గత 18 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.తొక్కిసలాట ఘటన కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు.