తెలుగు ప్రముఖ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 : ది రూల్ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బన్నీ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందాన నటిస్తుండగా అనసూయ, అజయ్, ఫహాద్ ఫజిల్, శ్రీతేజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
టాలీవుడ్ ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అయితే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రమైన పుష్ప 2 రిలీజ్ కి ముందే దాదాపుగా రూ.1000 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.
అయితే పుష్ప 2 డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ అనుకున్న డేట్ కి వక రోజు ముందుగానే డిసెంబర్ 5న పుష్ప 2 ని థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది. లాంగ్ వీకెండ్ ఉండటంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు
ఇక 2021లో రిలీజ్ అయిన పుష్ప: ది రైస్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.390 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన మాస్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక సమంత స్పెషల్ సాంగ్, మదర్ సెంటిమెంట్, ఇంట్రెస్టింగ్ స్టోరీ వంటివాటి కారణంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో పుష్ప 2 : ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/SZMNKWJKMJ
— Allu Arjun (@alluarjun) October 24, 2024