పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్.. ఈసారి తగ్గేదేలే అంటున్న ఐకాన్ స్టార్

పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్.. ఈసారి తగ్గేదేలే అంటున్న ఐకాన్ స్టార్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప : ది రైజ్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. దీంతో పుష్ప 2: ది రూల్  సినిమా కోసం ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే  పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6కి రిలీజ్ వాయిదా వేశారు. 

కానీ ఇప్పటివరకూ చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి ప్రమోషన్స్ లేదా అప్డేట్ లేకపోవడంతో ఈసారైనా అనుకున్న సమయానికి పుష్ప 2 సినిమాని రిలీజ్ చేస్తారా అనే అనుమానం మొదలైంది. 

ALSO READ | సమంత గురించి ఆమె ముందే త్రివిక్రమ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

దీంతో ఇటీవలే చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల చెయ్యబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. అలాగే ఈ విషయానికి సంబంధించి పోస్టర్ ని కూడా షేర్ చేసింది. 

ఈ పోస్టర్లో "పుష్ప2 మొదటి సగం రూల్ ఫైర్‌తో లాక్, లోడ్,  ప్యాక్ చేయబడింది. అలాగే పుష్ప బాక్సాఫీస్‌ ని బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది. మీరు కూడా రెడీ గా ఉండండి చూడటానికి అని చెబుతూ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుందని నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా  పుష్ప 2 చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా పుష్ప 2 మొదటి భాగం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ, యానాం అలాగే కేరళ రాష్ట్రంలో తెరకెక్కించారు.