Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ వాయిదా..

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ వాయిదా..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 గతఏడాది డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 35 రోజుల్లోనే బాహుబలి 2 రికార్డులని బ్రేక్ చేసింది. ఈ క్రమంలో రూ.1832 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. 

అయితే ఈ సినిమాతో మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మేకర్స్ పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఇందులోభాగంగా ఈ సినిమాకి 20నిముషాలు అదనంగా జతచేసి జనవరి 11న మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 

కానీ పలు టెక్నీకల్ కారణాలవల్ల పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా జనవరి 17న పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలిపారు. దీంతో సంక్రాంతి పండగకి పుష్ప సినిమాని థియేటర్లలో చూడాలనుకుం వారికి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు.

ALSO READ | మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు..

అయితే, ఈ సినిమా రన్ టైం ఇప్పటికే 3 గంటల 15 నిముషాలు ఉంది. ఇదే చాలా ఎక్కువ రన్ టైం. ఇక దీనికి తోడు మరో 20 నిమిషాల ఫుటేజీని జోడించి తీసుకొస్తుండటం ఒక విధంగా విశేషం అని చెప్పాలి. ఎందుకంటే , సినిమా చూస్తున్న ఆడియన్స్ అల్లు అర్జున్ స్వాగ్ కి ఫిదా అవుతున్నారు కాబట్టే.. ఇప్పటికీ చూస్తున్నారు. 

ఇటీవలే రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో ఉన్న అల్లు అర్జున్ స్టిల్ జపాన్ సీక్వెన్స్‌లోనిది. ఇది ట్రైలర్‌లో కూడా ఉంది. కానీ థియేట్రికల్ వెర్షన్ నుండి తొలగించబడింది. అయితే, ఇపుడు యాడ్ చేస్తున్న 20 నిమిషాల కొత్త కంటెంట్‌లో ఉండొచ్చని విషయమే అర్ధమవుతుంది. అలాగే ఇతర ముఖ్యమైన సీన్స్ కూడా రావొచ్చని ఐకాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.