Pushpa 2: పుష్ప 2 స్క్రీనింగ్‌కు అంతరాయం..కెమికల్ని స్ప్రే చేయడంతో షో నిలిపివేత.. ఎక్కడంటే?

Pushpa 2:  పుష్ప 2 స్క్రీనింగ్‌కు అంతరాయం..కెమికల్ని స్ప్రే చేయడంతో షో నిలిపివేత.. ఎక్కడంటే?

పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో డిసెంబర్ 5న రిలీజయింది. అయితే, కొన్నిచోట్ల స్క్రీనింగ్కి అంతరాయం కలిగింది. ఇప్పటివరకు ఓ వైపు తొక్కిసలాటలు, టికెట్ల కోసం పోరాటాలు, మధ్యలో అనవసరమైన గొడవలు ఇలా చూస్తూ వస్తున్నాం. కానీ, మహారాష్ట్ర ఓ థియేటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 

మహారాష్ట్ర బాంద్రాలోని గెలాక్సీ థియేటర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. ప్రేక్షకులలో తీవ్ర అసౌకర్యానికి కారణమైన పదార్థాన్ని స్ప్రే చేయడంతో షో అర్దాంతరంగా ఆగిపోయింది. అలా ఆ వ్యక్తి  స్ప్రే చేసిన కెమికల్ కి ప్రేక్షకులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమందికి దగ్గు, గొంతు, చికాకు మరియు వాంతులు ఇలా పలురకాలుగా ఇబ్బంది పడ్డారు. దాంతో వారందరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఒక గుర్తుతెలియని వ్యక్తి కారణంగా ఈ ఘటన జరగడంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నేరస్థుడిని గుర్తించడానికి మరియు స్ప్రే చేసిన ఆ పదార్థం యొక్క స్వభావాన్ని నిర్ధారించడానికి అధికారులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇకపోతే డిసెంబర్ 4న RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో అన్యాయంగా చనిపోయింది. ఆమెతో పాటు తన 13 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఇపుడు విషమంగా ఉంది. ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ ఏంటనేది 48 గంటల గడిస్తే తప్ప ఇప్పడే ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు.