Pushpa2TheRule: నీ యవ్వ అస్సలు తగ్గేదేలే.. రిలీజ్కు ముందే 'పుష్ప 2' నెలకొల్పిన రికార్డులు ఇవే

Pushpa2TheRule: నీ యవ్వ అస్సలు తగ్గేదేలే.. రిలీజ్కు ముందే 'పుష్ప 2' నెలకొల్పిన రికార్డులు ఇవే

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2 The Rule) రిలీజ్కు ముందే ప్రతి విషయంలో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళ్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ యూట్యూబ్లో దూసుకెళ్తున్నాయి. దానికి తోడు దేశ వ్యాప్తంగా వరుస ప్రమోషన్స్‌తో అల్లు అర్జున్, రష్మిక ఆ హైప్‌ను మరింత రెట్టింపు చేస్తున్నారు. ఇక అంతేకాకుండా పుష్ప 2 మూవీ విడుదలకి ముందే కోట్లు కొల్లగొడుతోంది. అవేంటో ఓ లుక్కేయండి.

1. బిగ్గెస్ట్ ఇండియన్ రిలీజ్ సినిమాగా 12వేల+ స్క్రీన్‌లలో రిలీజ్కు రావడం

2. రూ.1025+ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడం

3. హయ్యెస్ట్ టికెట్ రేట్స్తో రిలీజ్ అవ్వడం, ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్లో దూసుకెళ్లడం

4. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటి వరకూ 6.6 లక్షల టికెట్లు అమ్ముడవ్వడం

5.  ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటికే 50 వేల టికెట్స్ అమ్ముడవ్వడం

6.ఉత్తర అమెరికాలోనే ఇప్పటివరకు రూ.16 కోట్ల టిక్కెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి

7. ఇండియాలో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్‌లో రూ.55.30 కోట్ల గ్రాస్‌తో (బ్లాక్డ్ సీట్లు మినహాయించి) అగ్రస్థానంలో ఉంది.

8. బుక్‌ మై షోలో 1.5 మిలియన్‌, పేటీయంలో 2.4 మిలియన్ల మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 

9. Dec 2న దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లలో 55,000 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలిరోజే 2.79 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి.

Also Read : కొండగట్టు అంజన్నను దర్శించుకున్న వరుణ్ తేజ్

10. కేరళలో డిసెంబర్ 1న అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్అవ్వగా.. 12 గంటల్లోపే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ద్వారా రూ. 1 కోటికి పైగా కలెక్షన్స్ నమోదు చేసిన తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసుకుంది.

11. ఇండియాలో మొదలైన అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అధిగమించింది.

9.  హిందీ వెర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్స్లో 24 గంటల్లోనే 1 లక్ష టికెట్స్‌ అమ్ముడవ్వడం. 

10. ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌’ సాంగ్ పలు భాషల్లో 150+ మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. 

11. ‘సూసేకి’ సాంగ్ తెలుగులో 160+ మిలియన్‌, హిందీలో 105+ మిలియన్‌, తమిళంలో 7.6+ మిలియన్‌ మలయాళంలో 1.1+ మిలియన్‌, కన్నడలో 34K+

12. 'కిస్సిక్'.. అత్యంత వేగంగా 18 గంటల్లోనే 25+ మిలియన్‌ వ్యూస్‌ రాబట్టింది.

13. ‘పీలింగ్స్‌’ సాంగ్‌ తెలుగులో 13+ మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

14. బీహార్ పాట్నాలో జరిగిన ‘పుష్ప 2’ వైల్డ్‌ఫైర్‌ ఈవెంట్‌కు.. హైయెస్ట్‌ లైవ్‌ వ్యూవర్స్‌ రావడం

15. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. పుష్ప 2 మూవీ ఫస్ట్ డే రూ.303 కోట్లకి పైగా వసూళ్లు చేయొచ్చని అంచనా

16. ఇక అంతేకాకుండా హైదరాబాద్‌‌లో 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ కోసం 1000 మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేసారు. ఫస్ట్ టైమ్ ఇంతమంది పోలీసులని పెట్టి ఈవెంట్ జరపడం. ఇవే కాదు మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తూ వెళ్తోంది.

పుష్ప 2 మూవీ.. డిసెంబరు 5న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలి, హిందీ.. ఇలా మొత్తం ఆరు భాషల్లో రిలీజ్‌కాబోతోంది.