కిమ్స్ నుంచి శ్రీతేజ్​ డిశ్చార్జ్.. కళ్లు తెరిచి చూస్తున్నాడు. కానీ మనుషులను గుర్తుపట్టడం లేదు

కిమ్స్ నుంచి శ్రీతేజ్​ డిశ్చార్జ్.. కళ్లు తెరిచి చూస్తున్నాడు. కానీ మనుషులను గుర్తుపట్టడం లేదు

పద్మారావునగర్, వెలుగు: పుష్ప-2 సినిమా రిలీజ్​సందర్భంగా ఆర్టీసీ క్రాస్​రోడ్​ సంధ్య థియేటర్​వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్​ను మంగళవారం సికింద్రాబాద్​కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ చేశారు. డాక్టర్ల సూచనతో న్యూరో రిహాబిలిటేషన్​సెంటర్ కు షిఫ్ట్​చేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త బెటర్​అయిందని, ఆక్సిజన్, రెస్పరేటరీ సపోర్టు లేకుండానే నోటి ద్వారా ఫుడ్​ తీసుకుంటున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

‘‘శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడు. కానీ మనుషులను గుర్తుపట్టడం లేదు. బ్రెయిన్​ఇంకా రికవరీ కాలేదు. 15 రోజుల నుంచి నోటి ద్వారా లిక్విడ్స్ తీసుకుంటున్నాడు. కిమ్స్​డాక్టర్లు రెండు వారాల శ్రీతేజ్​ను ఐసీయూ నుంచి స్పెషల్​రూమ్​కు షిఫ్ట్​చేశారు. ఆసుపత్రిలోనే ఉంటే మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్​ వస్తున్నాయి.

న్యూరో రిహాబిలిటేషన్​సెంటర్​లో ఉంచితే ఇన్ఫెక్షన్స్​తగ్గుతాయని డాక్టర్లు తెలిపారు. అందుకే అక్కడికి షిఫ్ట్​చేస్తున్నాం. 15 రోజులపాటు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇప్పించాలి. కిమ్స్​లో అడ్మిట్ అయిన నాటి నుంచి డిశ్చార్జ్ ​అయ్యే వరకు ఆసుపత్రి యజమాన్యం నన్ను డబ్బులు అడగలేదు. ఖర్చంతా పుష్ప మూవీ టీమ్ నే చూసుకుంది. వారితోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, మీడియా నుంచి ఎంతో సపోర్టు లభించింది. అందరికీ కృతజ్ఞతలు’’ అని శ్రీతేజ్​తండ్రి భాస్కర్​తెలిపారు. కాగా గతేడాది డిసెంబర్ 4న శ్రీతేజ్ ను కిమ్స్ లో అడ్మిట్​చేయగా, 4 నెలల 25 రోజులపాటు ట్రీట్మెంట్ కొన సాగింది.