Allu Arjun: ఇండియా నుంచి ఒకే ఒక్కడు.. హాలీవుడ్ మ్యాగజైన్ కోసం అల్లు అర్జున్ ఫోటో షూట్..

Allu Arjun: ఇండియా నుంచి ఒకే ఒక్కడు..  హాలీవుడ్ మ్యాగజైన్ కోసం అల్లు అర్జున్ ఫోటో షూట్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార దర్శకత్వంలో వచ్చిన పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్  ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను సాధించాడు. అంతేకాదు గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. దీంతో పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండవ సినిమా గా రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే అల్లు అర్జున్ ఇటీవలే "ది హాలీవుడ్ రిపోర్టర్" ఇండియా మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా మంచి స్టైలిష్ దుస్తులు ధరించి గాగుల్స్ తో ఫొటోలకి పోజులిచ్చాడు. ఈ ఫోటోలని "ది హాలీవుడ్ రిపోర్టర్" ఇండియా మ్యాగజైన్ లోని కవర్ పేజీలో పబ్లిష్ చేశారు. ఇక అల్లు అర్జున్‌ను కవర్ పేజీలో పరిచయం చేస్తూ  “తెలుగులో తీసిన పుష్ప 2 చిత్రంతో, అల్లు అర్జున్ హిందీ సినిమా ఇండస్ట్రీలో చరిత్రను సృష్టించాడు. అలాగే ఒక్క హిందీ మాట కూడా మాట్లాడకుండానే దేశ హృదయాన్ని జయించాడు.” ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇలా రాసింది.

ఇప్పటి వరకూ, ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీపై అల్లు అర్జున్ తప్ప మరెవరూ లేరు. ఈ అరుదైన ఘనత అల్లు అర్జున్ కి మాత్రమే దక్కింది. ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యామిలీతో కలసి విదేశాలకి టూర్లు వెళుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్  త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ కుమార్ తదితర స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఈ ఏడాది జూన్ లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేసేందుకు కూడా ఓ స్టార్ డైరెక్టర్ తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.