రికార్డ్స్ రపా...రపా.. ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2 ..

రికార్డ్స్ రపా...రపా.. ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2 ..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా కేవలం హిందీలోనే దాదాపుగా రూ.1000 కోట్లు (నెట్) కలెక్ట్ చేసి బాలీవుడ్ హీరోల రికార్డులని బ్రేక్ చేసింది. అంతేకాదు ఇండియన్ సినీ చరిత్రంలోనే అతి తక్కువ సమయంలో రూ.1500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. 

 ఈరోజు పుష్ప 2 మూవీ మేకర్స్ ఈ సినిమా లేటెస్ట్ కలెక్షన్స్ ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ లోకల్, ఓవర్సీస్ లో కలిపి రూ.1871 కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. అంతేకాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిట్ అంటూ పుష్ప సినిమాలోని పవర్ఫుల్ సిగ్నేచర్ పోజ్ తో పోస్టర్ ని కూడా షేర్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే  సుకుమార్, నిర్మాతలు పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | ఇదేంది బాసూ..... రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన రీ రిలీజ్ సినిమా..

అయితే ఇటీవలే పుష్ప 2 సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ పై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో కమర్షియల్ ట్యాక్స్ వివరాలపై ఆసక్తి నెలకొంది.

పుష్ప 2 సినిమాకి సంబందించిన జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-01 రిటర్న్స్‌ కి సంబందించిన ఇతర ఖర్చులతో కలుపుకుని గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకి గానూ దాదాపుగా రూ.110 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రమేకాదు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. అయితే కేవలం ట్యాక్స్ మాత్రమే రూ.వంద కోట్లు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాల టర్నోవర్ ఏ రేంజ్ లో ఉంటుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యామిలీతో కలసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ షూటింగ్ జూన్ నెలలో మొదలు కానున్నట్లు సమాచారం.