Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ ఊచకోత.. రెండు గంటల్లోనే రికార్డ్ వ్యూస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The Rule). ఈరోజు(ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భాంగా పుష్ప 2 టీజర్ విడుదల చేశారు మేకర్స్. గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్ లో అమ్మవారి అవతారంలో మాస్ జాతర చేశారు అల్లు అర్జున్. టీజర్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా ఐపోతున్నారు. ఒక్కో షాటు ఒక్కో విజువల్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక ఆ విజువల్స్ కి రాక్ స్టార్ దేవి అందించిన మ్యూజిక్ ఆడియన్స్ ను పూనకాలు తెప్పిస్తోంది. 

దాంతో ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తూ.. టీజర్ అరాచరంగా ఉందని, ఇది అల్లు అర్జున్ మాస్ జాతర అని, ఇది పుష్పాగాడి ఆగమనం అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ టీజర్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ తో రికార్డ్ లెవల్లో వ్యూస్ వస్తున్నాయి. టీజర్ విడుదలైన కేవలం రెండు గంటల్లోనే ఏకంగా 3 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్. క్షణ క్షణానికి ఈ లెక్కలో భారీ మార్పు వస్తోంది.

కాగా.. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే రిలీజ్ తరువాత ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ప్రేక్షకుల్లో పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. కేవలం.. ప్రీ రిలీజ్ బిజినెసే వెయ్యి కోట్ల రేంజ్ లో అవుతుండటంటే పుష్ప మ్యానియా ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జస్ట్ పాజిటీవ్ టాక్ వచ్చిందంటే చాలు.. రికార్డ్స్ లెవల్లో వసూళ్లు రావడం గ్యారంటీ.