పుష్ప2 నుంచి మరో సాంగ్.. వచ్చుండాయ్ పీలింగ్స్

పుష్ప2  నుంచి మరో సాంగ్.. వచ్చుండాయ్ పీలింగ్స్

అల్లు అర్జున్, రష్మిక మందన్నా  జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘పుష్ప2 ది రూల్’.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది. ఇప్పటికే  విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం ఈ చిత్రంలోని ‘పీలింగ్స్’ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటకు  చంద్ర బోస్ క్యాచీ లిరిక్స్ రాయగా, శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ  దాస పాడిన తీరు ఆకట్టుకుంది. 

‘ఆరింటికోసారి, ఏడింటికోసారి, పదింటికోసారి.. పడుకుంటే  ఓసారి, నిల్చుంటే ఓసారి, ఏమీతోచక కూర్చుంటే ఓసారి.. వచ్చుండాయ్ పీలింగ్స్.. వచ్చి వచ్చి చంపేస్తున్నాయ్ పీలింగ్స్’ అంటూ సాగిన పాటలో అల్లు అర్జున్, రష్మిక ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌తో ఇంప్రెస్ చేశారు.  సునీల్, ఫహాద్  ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్,  ధనుంజయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.