Pushpa 2: The Rule Trailer: పుష్పరాజ్ నిజంగానే వైల్డ్ ఫైరేనబ్బా.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ బద్ధలు.. అదీ 15 గంటల్లోనే..

Pushpa 2: The Rule Trailer: పుష్పరాజ్ నిజంగానే వైల్డ్ ఫైరేనబ్బా.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ బద్ధలు.. అదీ 15 గంటల్లోనే..

Pushpa 2: The Rule Trailer: టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 : ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ డిసెంబర్ 05న రిలీజ్ కాబోతోంది. దీంతో ఆదివారం బీహార్ లోని పాట్నా సిటీలో గ్రాండ్ గా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. 

అయితే పుష్ప 2 : ది రూల్ ట్రైలర్ రిలీజ్ అయిన 15 గంటల్లోనే దాదాపుగా 41 మిలియన్స్ వచ్చాయి. ఇప్పటివరకూ  యూట్యూబ్ లో రిలీజ్ అయిన మొదటిరోజే హైయ్యేస్ట్ వ్యూస్ సాధించిన చిత్రాల్లో పుష్ప 2 టాప్ లో నిలిచింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ఫ్యాన్స్ కి తెలియజేస్తూ స్పెషల్ గా పోస్టర్ షేర్ చేసింది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్ అని,  అలాగే సౌత్ ఇండియాలోనే ఇంత పెద్దమొత్తంలో వ్యూస్ సాధించిన ఫస్ట్ సినిమా అని పేర్కొంది.

ఇక తర్వాతి స్తానాల్లో మహేష్ బాబు గుంటూరు కారం(37.68 మి), ప్రభాస్ సలార్(32.58 మి), సర్కారు వారి పాట(26.77 మి), రాధే శ్యామ్  (23.20 మి) సినిమాలు ఉన్నాయి. దీంతో పుష్ప 2 క్రేజ్ ని బట్టి చూస్తే సులభంగా 1500 కోట్లకి పైగా కలెక్షన్లు సాధిస్తుందని నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు. ఇక హిందీలో 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Also Read:- సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా అదే చేస్తాం

ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్ కలసి సంయుక్తంగా నిర్మించారు. సినిమా బిజినెస్ విషయంలో కూడా మేకర్స్ బాగానే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. 

ఈ క్రమంలో  పుష్ప 2 రిలీజ్ కి ముందే 1060 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్  దాదాపుగా  13500  థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇందులో మనదేశంలోనే ప్యాన్ ఇండియా భాషలలో దాదాపుగా 7500 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. దీంతో పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపుగా రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.