టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 05న రిలీజ్ కాగా రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. దీంతో హిందీలో ఇప్పటివరకూ ఉన్న సినిమాల రికార్డులన్ని బ్రేక్ చేసి టాప్ లో కొనసాగుతోంది.
అయితే మంగళవారం పుష్ప 2 మేకర్స్ 19 రోజుల కలెక్షన్స్ ప్రకటించారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ పుష్ప 2: ది రూల్ కేవలం హిందీలో మాత్రమే రూ.702 కోట్లు (నెట్) రాబట్టినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ విషయానికి సంబందించిన అఫీషియల్ పోస్టర్ ని షేర్ చేశారు.
ALSO READ | హీరోకంటే విలన్ కి ఎక్కువ రెమ్యునరేషన్.. ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నాడట..
ఈ క్రమంలో "హిందీలో 700 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా" అని తెలిపారు. దీంతో పుష్ప రాజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు ఉండటంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ వారాంతానికి రూ.900 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ విషయం ఇలాఉండగా ఇప్పటివరకూ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన పుష్ప 2 ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.1700 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో బాహుబలి 2, దంగల్(హిందీ) సినిమాల కలెక్షన్స్ రికార్డులని బ్రేక్ చేసేందుకు రెడీ అవుతోంది.
Pushpa Raj introduces the 700 CRORE CLUB to HINDI CINEMA 💥💥
— Pushpa (@PushpaMovie) December 24, 2024
The FIRST EVER FILM to collect 700 CRORES in HINDI ✨#Pushpa2TheRule collects massive 704.25 CRORES NETT in Hindi ❤🔥❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star… pic.twitter.com/TTEKE6mMMR