Pushpa 2 Movie: హైదరాబాద్ లో ఏ ధియేటర్ లో ఎంతెంత టికెట్ ధర అంటే..!

Pushpa 2 Movie: హైదరాబాద్ లో ఏ ధియేటర్ లో ఎంతెంత టికెట్ ధర అంటే..!

Pushpa 2 Movie: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప 2:ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో దర్శక నిర్మాతలు సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించగ సానుకూలంగా స్పందించాయి. ఈ క్రమంలో థియేటర్ ని బట్టి రేటు పెంచుకునే వెసులుబాటు కలిగించాయి.

ఇందులోభాగంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 04న 9.30 గంటలకి స్పెషల్ షోస్ కి పర్మిషన్స్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800 ఖరారు చేసింది. అంతేగాకుండా అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చింది. 

ALSO READ | Pushpa2 The Rule: పండగ చేస్కోండి : పుష్ప 2.. 5న కాదు.. 4వ తేదీ నైట్ నుంచే షోలు

ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200, అలాగే డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు పర్మిషన్ ఇచ్చింది.  డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతి ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే హిందీలో పుష్ప2 టికెట్లు రిలీజ్ చేసిన గంటలోపే 8వేల టికెట్లు సేల్ అయ్యాయి. దీంతో తెలుగులో టికెట్లు బూకింగ్స్ ఈరోజు సాయంత్రం 04:56 గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పుష్ప2 కి ఉన్న క్రేజ్, స్క్రీన్స్, టికెట్ ధరలు వీటన్నింటినిబట్టి పుష్ప2 రిలీజ్ అయిన మొదటిరోజే దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.