Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?

Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?

పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) మూవీ ఇవాళ డిసెంబర్ 5న ఆరు భాషల్లో థియేటర్స్కి వచ్చింది. ఈ మూవీ కోసం మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తు వచ్చారు. ఇక ఎట్టకేలకు అభిమానుల ముందుకొచ్చిన పుష్ప రాజ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమా తొలి రోజే రూ. 250 కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.

పుష్ప 2 ఓటీటీ::

ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటీటీ ప్లాట్ఫామ్పై చర్చలు మొదలయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ పుష్ప 2 హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా రూ.250 కోట్లకు పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కుల్ని కైవసం చేసుకుందని టాక్.

అయితే.. మైత్రి మేకర్స్ పుష్ప 2 ఓటీటీ ప్లాట్ఫామ్పై అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ విషయాన్నినెట్‌ఫ్లిక్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది.

ఆ పోస్ట్‌లో "పుష్ప అజ్ఞాతం నుండి బయటకి వచ్చి బాక్సాఫీస్ను రూల్‌ చేయబోతున్నాడు. పుష్ప 2 ది రూల్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది!" అంటూ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

Also Read : పుష్ప 2 ప్రీమియర్స్కి కలెక్షన్ ఎంత వచ్చింది

2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకుంది.పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో పుష్ప సీక్వెల్ కోసం అమెజాన్కు..నెట్ఫ్లిక్స్ మధ్య ఎంతోగాను పోటీ ఏర్పడిందట. చివరికి దాదాపు మూడు రేట్లు ఎక్కువ మొత్తంతో పుష్ప2 ను నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకోందని తెలుస్తోంది.

ఇక పుష్ప 2 థియేటర్లో డిసెంబర్ నెల మొత్తం ఆడే అవకాశం ఉంది. అంతేకాదు సంక్రాంతి వరకు కూడా రూల్ చేసే సత్తా లేకపోలేదు. ఇక పుష్ప 2 థియేటర్ రన్ ముగిశాక.. అంటే మూడు నెలల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)