Pushpa 2 : The Rule: నార్త్ అమెరికాలో 850 లొకేషన్స్ లో పుష్ప 2 గ్రాండ్ రిలీజ్.. ప్రభాస్, రామ్ చరణ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా.?

Pushpa 2 : The Rule: నార్త్ అమెరికాలో 850 లొకేషన్స్ లో పుష్ప 2 గ్రాండ్ రిలీజ్.. ప్రభాస్, రామ్ చరణ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా.?

Pushpa 2 : The Rule: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 : ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కాగా అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఇదే ఊపులో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎప్పుడూ లేనివిధంగా తెలుగు సినీ చరిత్రలోనే సినిమా రిలీజ్ కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1060 కోట్లు చెయ్యడం ఇదే మొదటిసారి. పుష్ప 2 సినిమా నార్త్ అమెరికాలో డిసెంబర్ 04న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో తెలుగుతోపాటూ ఇతర ఆడియన్స్ కూడా పుష్ప 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇటీవలే ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ విషయం తెలిసిందే. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో పుష్ప 2 మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే అత్యంత ఫాస్ట్ గా 1 మిలియన్ డాలర్లు కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 1.208 మిలియన్ డాలర్లు నార్త్ కలెక్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే ట్రైలర్ రిలీజ్ తర్వాత బుకింగ్స్ పెరిగినట్లు తెలుస్తుంది. అమెరికాలో దాదాపుగా 850 లొకేషన్స్ లో రిలీజ్ అవుతుండగా ఇప్పటికే 40వేల టికెట్లు సేల్ అయినట్లు సమాచారం.

అయితే ఇప్పటివరకూ నార్త్ అమెరికాలో ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ప్రభాస్ బాహుబలి రెండుభాగాలు (20.77 మిలియన్ డాలర్లు ), కల్కి 2898 AD (18.57 మిలియన్ డాలర్లు), రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి నటించిన మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ (15.15 మిలియన్ డాలర్లు) చిత్రాలు ఉన్నాయి. దీంతో ఈ కలెక్షన్ల రికార్డులను అల్లు అర్జున్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

ALSO READ | Kissik Song: పుష్ప 2 శ్రీలీల 'కిసిక్’ సాంగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

ఈ విషయం ఇలా ఉండగా బీహార్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తరహాలోనే "పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్" ని నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులోభాగంగా నవంబర్ 24న తమిళనాడులోని సాయి రామ్ ఇంజినీరింగ్ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకి పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దేంతో దీంతో బన్నీ తమిళ్ ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.