Pushpa2Reloaded: థియేటర్లలో పుష్ప- 2 రీలోడెడ్ వెర్షన్.. టికెట్ ధరలను తగ్గించిన మేకర్స్

పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule ).. సినిమా రిలీజై 43 రోజులు దాటినా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ ఇప్పటికే ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇపుడు ఆడియన్స్ను మరింత దగ్గర చేయడానికి మేకర్స్ పుష్ప 2 రీలోడ్ వెర్షన్ తీసుకొచ్చారు.

ఇవాళ జనవరి 17 నుంచి 20 నిమిషాల కొత్త వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితం కానుంది. అయితే, జనవరి 17న సినీ ప్రేమికుల దినోత్సవం (Cinema Lover’s Day) సందర్భంగా 20 నిమిషాల రీలోడెడ్ వెర్షన్తో పాటు టిక్కెట్‌ ధరలు తగ్గించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ 20 నిమిషాల కొత్త కంటెంట్‌లో జపాన్ ఎపిసోడ్కి సంబంధించిన సీన్స్ హైలెట్ కానున్నాయట.

అయితే, పుష్ప 2 మూవీకి నైజాం రీజియన్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112 టిక్కెట్‌ ధర కేటాయించారు. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో రూ.150గా టిక్కెట్‌ ధర నిర్ణయించారు. అలాగే ఉత్తర భారతదేశంలో(నార్త్ ఇండియాలో) ప్రేక్షకులు 'పుష్ప 2'ని కేవలం రూ. 112తో సినిమా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 

ALSO READ | అన్నపూర్ణ స్టూడియోస్​కు 50 ఏళ్లు

అయితే, ఈ సినిమా రన్ టైం ఇప్పటికే 3 గంటల 15 నిముషాలు ఉంది. ఇదే చాలా ఎక్కువ రన్ టైం. ఇక దీనికి తోడు మరో 20 నిమిషాల ఫుటేజీని జోడించి తీసుకొస్తుండటం ఒక విధంగా విశేషం అని చెప్పాలి. ఎందుకంటే, సినిమా చూస్తున్న ఆడియన్స్ అల్లు అర్జున్ స్వాగ్కి ఫిదా అవుతున్నారు కాబట్టే.. ఇప్పటికీ చూస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా సీన్స్ యాడ్ చేస్తుండటంతో ఆవేలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. మరి ఈ కొత్త ఫుటేజ్ ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందో చూడాలి. 

పుష్ప 2 కలెక్షన్స్:

దాదాపు రూ.400-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2 మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండియాలో ఈ మూవీ రూ.1224.65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. జనవరి 6 వరకు పుష్ప 2.. వరల్డ్ వైడ్ గా రూ.1832 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మైత్రి మేకర్స్ రిలీజ్ చేశారు. ఐక్య అప్పటినుంచి ఎలాంటి వసూళ్ల అప్డేట్ పోస్టర్ విడుదల చేయలేదు. అయితే, సినిమా థియేటర్స్ లో ఇంకా రన్ అవుతుండటంతో కలెక్షన్స్ రూ.1900 కోట్ల వరకు చేరుకోవొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలో ఉంది. చూడాలి మరి 20 నిమిషాల పుటిజ్ ఏం మార్చనుందో!