Pushpa 2: అభిమానుల రచ్చ.. చెన్నూరులో థియేటర్ అద్దాలు ధ్వంసం

Pushpa 2:  అభిమానుల రచ్చ.. చెన్నూరులో  థియేటర్ అద్దాలు ధ్వంసం

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ఫీవర్ మొదలైంది.  డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్ల ముందు అభిమానులు రచ్చరచ్చ సృష్టిస్తున్నారు. కొన్నిచోట్ల అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. థియేటర్లలో బీభత్సం సృష్టిస్తున్నారు. 

సినిమా వేయడం  ఆలస్యం అయ్యిందంటూ ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో శ్రీనివాస థియేటర్ అద్దాలు  ధ్వంసం చేశారు అభిమానులు. అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేశారు. సినిమా ప్రదర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమాను ఎందుకు ప్రదర్శించడం లేదని మండిపడ్డారు.

Also Read : పుష్ప రాజ్ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి?

డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో  సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే.. అల్లు అర్జున రాక సందర్భంగా థియేటర్ దగ్గర భారీగా అభిమానులు చేరడంతో  తొక్కిసలాట జరిగింది.  ఈ ఘటనలో కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చిన   రేవతి అనే మహిళ మృతి చెందగా..  ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో  సెక్యూరిటీ సరిగా ఏర్పాటు చేయలేదని సంధ్య థియేటర్ పై పోలీసులు కేసు నమోదు చేసింది.