
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన ‘పుష్ప2 ది రూల్’ చిత్రం భారీ అంచనాల మధ్య గత డిసెంబర్‌లో విడుదలై సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’ ఉండనుందని ఇప్పటికే టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ‘పుష్ప2’ విషయంలో హీరోతోపాటు టీమ్ అంతా కూడా కొన్ని వివాదాలు ఫేస్ చేయగా అసలు ‘పుష్ప3’ ఉంటుందా, ఉండదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా పార్ట్3 అప్‌డేట్‌ను అందించారు చిత్ర నిర్మాత. ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ గురించి మాట్లాడారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి, 2028లో ‘పుష్ప3 ది ర్యాంపేజ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. ఈ గుడ్ న్యూస్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా విడుదలై వంద రోజులు పూర్తి చేసుకుంది.
మరోవైపు దర్శకులు త్రివిక్రమ్, అట్లీలతో బన్నీ సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. వీటిలో ఏది ముందు సెట్స్‌కు వెళ్లనుందని టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.