గ్రాండ్ గా పుష్ప విలన్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

గ్రాండ్ గా పుష్ప విలన్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన "పుష్ప" సినిమాలో విలన్ గా నటించిన కన్నడ హీరో ధనుంజయ్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఈ సినిమాలో జాలి రెడ్డి డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. అయితే నటుడు ధనుంజయ్ పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో ధనుంజయ్ కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మెన్ కూతురు ధన్యత అనే అమ్మాయిని పెద్దలు కుదురిచ్చిన వివాహం చేసుకున్నాడు. 

వీరి పెళ్లి మైసూరులోని మైసూర్ లోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో ఆదివారం (ఫిబ్రవరి 16) ఘనంగా జరిగింది. ఈ వివాహానికి కర్ణాటకకు చెందిన పలువురు సినీ సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ పెళ్ళికి వెళ్లినట్లు సమాచారం.

ALSO READ | రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తండేల్.... నాగ చైతన్య కెరీర్ లో ఇదే టాప్..

అయితే నటుడు ధనుంజయ్ ఈమధ్య తెలుగు సినిమాల్లో నటించడానికి బాగానే ఆసక్తి చూపుతున్నాడు. ఆ మధ్య తెలుగులో ప్రముఖ హీరో సత్యదేవ్ తో కలసి నటించిన జీబ్రా సినిమా బాగానే ఆకట్టుకుంది. ఓటిటి లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో త్వరలోనే స్ట్రైట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.