ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2021లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక సినిమాలో అల్లు అర్జున్ నటన గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి, డైలాగ్ డెలివరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే.. ఇటీవల జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు అల్లు అర్జున్.
నిజానికి.. పుష్ప సినిమాకు తెలుగులో కంటే హిందీలోనే మంచి టాక్ వచ్చింది. అక్కడి ఫ్యాన్స్ అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసినా పుష్ప.. తగ్గేదే లే అంటూ డైలాగ్స్ తో రెచ్చిపోయారు. అందుకే.. ఇప్పుడు వస్తున్న పుష్ప సీక్వెల్ కోసం మన ఆడియన్స్ కంటే ఎక్కువగా హిందీ ఆడియన్సే ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టిన పుష్ప మూవీ తాజాగా మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటంటే.. 2009 నుండి ఇప్పటివరకు విడుదలైన బెస్ట్ హిందీ సినిమాల్లో టాప్ 2లో స్థానం దక్కించుకుంది పుష్ప. ఒర్మాక్స్ సంస్థ జరిపిన ఈ సర్వేలో దంగల్, భాగ్ మిల్కా భాగ్ వంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి టాప్ లో నిలిచింది పుష్ప. ఇక లిస్టులో మొదటి స్థానంలో అమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ 3 ఇడియట్స్ నిలువగా.. రెండవ స్థానంలో అల్లు అర్జున్ పుష్ప నిలిచింది.
Top 10 most-liked Hindi theatrical films since 2009: Pushpa - The Rise: Part 01 shares the top position with 3 Idiots, becoming only the second film ever with an Ormax Power Rating of 90. #AlluArjun on the top and #Pushpa2TheRule to 100 kodtam pic.twitter.com/RE3dr7yf3q
— Allu Arjun USA FC (@bhaaifcusa) July 2, 2024
నిజానికి ఒక సౌత్ సినిమా సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టేసి రెండవ స్థానంలో నిలువడం అంటే మాములు విషయం కాదు. ఆ విషయంలో అల్లు అర్జున్ గ్రేట్ అనే చెప్పుకోవాలి. నార్త్ టాప్ స్టార్స్ ను పక్కకు నెట్టేసి తన సినిమాను టాప్ లో నిలిచేలా చేశారు. దాంతో.. అది మా ఐకాన్ స్టార్ రేంజ్ అంటూ కాలర్ ఎగరేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక ఆయన హీరోగా వస్తున్న పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.