"సినిమాల్లో రూలింగ్.. ఇండియా బాక్సాఫీస్ షేకింగ్.." ఇప్పుడీ ఈ మాటల్ని సెట్ చేస్తోంది పుష్ప 2. ఈ మూవీ రోజురోజుకు కలెక్షన్స్ లో అరాచకం సృష్టిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు, ఐదు రోజుల్లో రూ. 922 కోట్లు.. ఇలా రోజుకోవంద కోట్లు పెంచుకుంటూ పోతుంది. ఇండియాలో అత్యంత వేగంగా రూ.900 కోట్ల మైలురాయిని దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది.
ఇక పుష్ప 2 ఐదు రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్‌లో కూడా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ ఉండట విశేషం. సోమవారం నాటికి ఐదు రోజుల మొత్తం ఇలా ఉన్నాయి. (తెలుగులో రూ. 211.7 కోట్లు, హిందీల నుంచి రూ. 331.7 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 34.45 కోట్లు, కన్నడలో రూ. 4.05 కోట్లు, మలయాళంలో రూ. 11.2 కోట్లు వసూలు అయింది)
922 CRORES GROSS for #Pushpa2TheRule in 5 days 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2024
A record breaking film in Indian Cinema - the fastest to cross the 900 CRORES milestone ❤🔥
RULING IN CINEMAS.
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/wXO9GmcTt9
ఇక SACNILK వెబ్ సైట్ ప్రకారం..
6వ రోజు మంగళవారం డిసెంబర్ 11న పుష్ప 2 ఇండియా వైడ్ గా మొత్తం రూ.52.4 కోట్లు రాబట్టినట్లు సమాచారం. (తెలుగులో రూ.11 కోట్లు, హిందీల నుంచి రూ.38 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ.2.5 కోట్లు, కన్నడలో రూ.0.4 కోట్లు, మలయాళంలో రూ.0.5 కోట్లు వసూలు అయింది). ఇప్పటివరకు పుష్ప 2 మూవీ రూ.648.27కోట్ల నెట్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి. వారం కాకముందే పుష్ప 2 వెయ్యి కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని టాక్.
ప్రభాస్ కల్కి మూవీ 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటి. కల్కి మొదటి వారం ముగిసేసరికి రూ.494.5 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ, పుష్ప 2 రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు మైలురాయిని దాటేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది.
ఇకపోతే కేరళలో మాత్రం పుష్ప 2 ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకోలేకపోతుంది. అక్కడ అల్లు అర్జున్ కి స్పెషల్ స్టేటస్ ఫ్యాన్స్ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా బన్నీని 'మల్లు అర్జున్' అంటూ పిలుస్తూ ప్రేమ చూపిస్తున్నారు..కానీ, కేరళలో వసూళ్లు సాధించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.