Pushpa 2 Day1 Collection: పుష్ప 2 ప్రీమియర్స్కి కలెక్షన్ ఎంత వచ్చింది.. డే 1 ఓపెనింగ్స్ ఎంత రావచ్చు?

పుష్ప 2 (Pushpa 2) అడ్వాన్స్ బుకింగ్స్లో రూ.100 కోట్లకి పైగా వసూళ్లు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. కేవలం ఇండియాలోనే రూ. 70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అంతేకాకుండా బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన మూవీగా రికార్డ్స్ నెలకొల్పింది. దాంతో ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి వసూళ్లు చేయనుందో, ట్రేడ్ వర్గాల అంచనా ఎన్ని కోట్ల మేరకు ఉందో తెలుసుకుందాం. 

పుష్ప 2  దాదాపు 12,000 స్క్రీన్లతో నేడు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ కోసం రూ. 7 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ కలెక్షన్స్ మొత్తం కలుపుకుని రూ. 77 కోట్ల ప్రీ-సేల్స్ సాధించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక్క హిందీ వెర్షన్ లోనే 27.12 కోట్లు, తెలుగు 2డి వెర్షన్ 38.37 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ ట్రేడ్ రిపోర్ట్ Sacnilk ప్రకారం.. గురువారం ప్రీమియర్స్ తోనే(Dec 4) డే 1 దాదాపు రూ.16.03 కోట్ల ఇండియా నికర సంపాదించినట్టు తెలిపింది.

Also Read :- ‘పుష్ప 2’ మూవీ X రివ్యూ

భారీ స్థాయిలో రిలీజైన పుష్ప 2 మూవీకి  కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి. అలాగే తమిళనాడులో రూ. 9 కోట్లు,కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ.8 కోట్ల మేరకు సాధించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో రూ.62 నుండి 72 కోట్లు వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇకపోతే పుష్ప 2 ఫస్ట్ డే రూ.250-300కోట్ల మేరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో RRR (2022) రూ.223 కోట్లతో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రికార్డును కలిగి ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్ సినిమాకి ఇవే హయ్యెస్ట్ కలెక్షన్స్. మరి పుష్ప 2 ఫస్ట్ డే ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.