Pushpa 2: ఇలా చేశావేంటి పుష్పరాజ్.. టికెట్లు బుక్ చేసుకున్నోళ్ల పరిస్థితేంటి ఇప్పుడు..!

Pushpa 2: ఇలా చేశావేంటి పుష్పరాజ్.. టికెట్లు బుక్ చేసుకున్నోళ్ల పరిస్థితేంటి ఇప్పుడు..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పుష్ప-2 సినిమా ఒక్కటే ట్రెండింగ్ టాపిక్ అయింది. నలుగురు కుర్రాళ్లు పిచ్చాపాటిగా మాట్లాడుకునే విషయాల్లో పుష్ప-2 టాపిక్ లేకుండా ఉండటం లేదంటే నమ్మండి. ఇంత క్రేజ్ సొంతం చేసుకున్న పుష్ప-2 సినిమాను 3డీలో వీక్షించాలని ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు ఇది చేదు వార్తేనని చెప్పక తప్పదు. ఎందుకంటే.. పుష్ప2 సినిమా 3డీ వెర్షన్ వర్క్ కంప్లీట్ అవ్వలేదని తెలిసింది. అందువల్ల.. పుష్ప2 3డీ వెర్షన్ రిలీజ్ పోస్ట్పోన్ అయింది. డిసెంబర్13న పుష్ప2 3డీ వెర్షన్ రిలీజ్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అప్పటికి 3డీ ప్రింట్స్ రెడీ అవుతాయట. ఎగ్జిబిటర్స్కు ఈ మేరకు పుష్ప2 టీం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.

మరి 3డీలో పుష్ప.2 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ మేనేజర్ సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు నిరాశచెందాల్సిన అవసరం లేదని, 3డీ షోలు క్యాన్సిల్ చేయడం లేదని.. ఆ 3డీ షోల స్థానంలో పుష్ప-2 2డీ వెర్షన్ షోస్ ప్రదర్శిస్తామని తెలిపారు. 3డీ టికెట్ రేట్లు ఎక్కువ ఛార్జ్ చేసి ఉంటారు కదా.. మరి ఆ డబ్బుల సంగతేంటని అడగ్గా.. 3డీ గ్లాసెస్ యూసేజ్ కారణంగా 3డీ వెర్షన్ టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయని.. ఆ ఛార్జీలను వీక్షకులకు రిఫండ్ చేస్తామని చెప్పారు.

ALSO READ : Pushpa2 The Rule: ఇది సార్ పుష్ప గాడి బ్రాండ్.. అడ్వాన్స్ బుకింగ్సే రూ.100 కోట్లు కొట్టాడంటే.. ఫస్ట్ డే కలెక్షన్ అంత పక్కానా..!

పుష్ప-2 హిందీ వెర్షన్ మిడ్నైట్ షోస్ డిసెంబర్ 4న ప్రదర్శించాలని తొలుత ప్లాన్ చేసినప్పటికీ పుష్ప-2 హిందీ వెర్షన్ డిసెంబర్ 5నే విడుదల కాబోతున్నట్లు తెలిసింది. పుష్ప-2 సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 9.30కే తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో పుష్ప-2 ప్రీమియర్ షో పడనుంది. డిసెంబర్ 5 అర్ధరాత్రి సమయానికే పుష్ప-2 అంచనాలను అందుకుందో, లేదో తెలిసిపోతుంది. డిసెంబర్ 5న కూడా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ రికార్డ్ స్థాయిలో బుక్ కావడం గమనార్హం. పుష్ప-2 సినిమా ఫస్ట్ డే టికెట్లు బుకింగ్స్ ఓపెన్ అయిన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా బుక్ అయ్యాయంటే పుష్పరాజ్ మేనియా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.