టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా కేవలం హిందీలోనే దాదాపుగా రూ.1000 కోట్లు (నెట్) కలెక్ట్ చేసి బాలీవుడ్ హీరోల రికార్డులని బ్రేక్ చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ.2000 కోట్లు పైగా కలెక్ట్ చేసిందని ఆమధ్య మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇటీవలే పుష్ప 2 సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ పై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో కమర్షియల్ ట్యాక్స్ వివరాలపై ఆసక్తి నెలకొంది.
పుష్ప 2 సినిమాకి సంబందించిన జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-01 రిటర్న్స్ కి సంబందించిన ఇతర ఖర్చులతో కలుపుకుని గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకి గానూ దాదాపుగా రూ.110 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రమేకాదు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. అయితే కేవలం ట్యాక్స్ మాత్రమే రూ.వంద కోట్లు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాల టర్నోవర్ ఏ రేంజ్ లో ఉంటుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అయితే ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ దాదాపుగా 11 సినిమాలు కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాల మేకింగ్ వాల్యూ దాదాపుగా రూ.6 వేల కోట్లు పైగా ఉండనున్నట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే రామ్ చరణ్ RC16 సినిమా షూటింగ్ మొదలైంది. అలాగే డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. మరో వైపు కెజీయఫ్ డైరెక్టర్ యష్ తో ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా కూడా 30% శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తో సితారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ.400 కోట్లు పైగా ఉంది. ఇవే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని కూడా మైత్రీ నిర్మిస్తుంది. ఇక టాలీవుడ్ లో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మైత్రీ నిర్మాతలు. దీంతో ఈ సినిమాలు కనుక కరెక్ట్ గా వర్కౌట్ అయితే దాదాపుగా రూ.15 నుంచి రూ.20 వేల కోట్లు టర్నోవర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.