శ్రీతేజ్ హెల్త్ బులిటెన్.. హెల్త్ ఓకే కానీ ఫ్యామిలీ మెంబర్స్ను గుర్తుపట్టడం లేదు..

శ్రీతేజ్ హెల్త్ బులిటెన్.. హెల్త్ ఓకే కానీ ఫ్యామిలీ మెంబర్స్ను గుర్తుపట్టడం లేదు..

సికింద్రాబాద్: పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ను వైద్యులు విడుదల చేశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇప్పుడు మరింత మెలకువగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. అయితే.. ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, పలకరిస్తే ప్రతి స్పందన చూపించడం లేదని చెప్పారు. డిసెంబర్ 4న పుష్ప2 బెనిఫిట్​షో సందర్భంగా పోలీసులు పర్మిషన్​ఇవ్వకున్నా అల్లు అర్జున్​ సంధ్య థియేటర్కు వెళ్లగా.. అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది.

ఆమె తొమ్మిదేండ్ల కొడుకు శ్రీతేజ్​కోమాలోకి వెళ్లాడు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్​తప్పుపట్టారు. దీనికి తోడు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను విచారణకు పిలిచి.. ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో ఆయన తన తప్పును ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అర్జున్ తండ్రి అల్లు అరవింద్, చిత్ర నిర్మాతలు శ్రీతేజ్​దగ్గరికి వెళ్లారు. రేవతి కుటుంబానికి సాయంగా రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను డిసెంబర్ 13న అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించి.. మధ్యంతర బెయిల్పై మరుసటిరోజు (14న) చంచల్​గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్కు ఇండస్ట్రీ ప్రముఖులు క్యూ కట్టి సంఘీభావం ప్రకటించారు. కానీ, రేవతి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకునేందుకు ఆవైపు పెద్దగా ఎవరూ వెళ్లకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.